Thursday, 3 December 2015

అమ్మ

అమ్మ 


పది మాసాలు మోసి
రక్త మాంసాలు పంచి
పెంచి ఉపిరి నిచ్చింది
అమ్మ

నే నవ్వితే నవరత్నాలు ఏరుకుంటుంది
నే నలత పడితే తానూ నలిగిపోతుంది
నే కలత పడితే తానూ కళోత్తుకుంటుంది
నే కడుపు నిండా తింటే తను త్రేస్తుంది

ముద్ద ముద్దను మురిపాలలో ముంచి తినిపిస్తుంది
గుండె కొండపై ఎక్కించి గుడిగంట కొట్టిస్తుంది
తన గుండె లోతుల్లో దేవుడికి
నా కోసం ముడుపులు కడుతుంది

తన ఎద చనుమాలలో
అమృతపు ఊతలు ఊరిస్తుంది
తన ఒడి తోటలో
ఉయలలూగిస్తుంది
తన అనుభవాల బడిలో
సుద్దు బుద్దులు దిద్దిస్తుంది

ఎతెత్తి  ఆటలు ఆడిస్తుంది
 ఉతుత్తి కోపం నటిస్తుంది
నా రేపటికి
తన రేబవళ్ళను కలిపి కరిగిస్తుంది
నా భావికై తాను బాటలు వేస్తుంది
రాళ్లు ముళ్ళు ఏరి పూలు పరుస్తుంది
నేను కనబడక పోతే కలవరం
నా అభ్యున్నతే తనకు వరం
అమ్మ ప్రేమ తక్కెడ లో
క్రింది పళ్ళెం ఎప్పుడూ నాదే

No comments:

Post a Comment