Friday, 4 December 2015

తాత

తాత 


పసి పిల్లల మొదటి పిలుపులలో
తాత అనే పలుకు
ప్రధానమైనదైనా కావచ్చు
ద్వితీయమైనదైనా  కావచ్చు
కానీ ఆ పిలుపు విని
ఆయన మది పాందే మైమరపు అద్వితీయమైనది

ఆయన కొడుకు గా రణ పెంకి
భర్త గా జగమొండి
తండ్రిగా చండశాసనుడు
అల్లుడిగా దశమ గ్రహమే కావాచు
కానీ తాతగా మైనపు ముద్ద
నాడు  మ్రొక్కై వంగని వాడు మ్రానై వంగును నేడు

ఆయన మనవాలను
ఉప్పు మూటలంటూ
మోసే బానిసౌతాడు
ఛల్ ఛల్ గుర్రమౌతాడు
భౌ భౌ ,మ్యావ్ మ్యావ్ అంటూ
మనవల సంతోషం కోసం
దశావతారాలు దాలుస్తాడు
ఎవరైనా మనవణ్ణి తాత డిట్టో అంటే చాలు
నా బంగారు కొండ అని మురిసిపోతూ
మీసం మెలేస్తాడు
మనవలతో  ఆటల పోటీ
టిఫిన్ వెరైటీ లలో పోటీ
అయినా ఆయనే ఆనందం గా ఒడి
గెలుపు ట్రోఫీని వాడికి అందిస్తారు
చెయ్యి తానూ అందించినా
చేయూత తన మనవడే నని తెలుసు
అదే భరోసా అదే ఆయన ఆశ 

సంక్రాంతి

ఆనందముగా తలలూచు వరిమళ్లు
గల గలా పారేటి సెలయేళ్ళు
జోరుగా సాగేటి ఎడ్లబళ్ళు
గణ గణ మొగేటి మువ్వల సవ్వళ్ళు

ఆలా మండలతో నిండారు చావాళ్ళు
నందనదనముగా తోచు మా పల్లెటూళ్ళు
రంగు రంగుల రంగవల్లుల లోగిళ్ళు
గోగు పూలతో అలరారు గొబ్బిళ్ళు

గంగిరేద్దులనాడించు మేళగాళ్ళు
హరికీర్తనలు  ఆలపించు తాళగాళ్ళు
భోగి మంటలు మొదలయేటి పగళ్ళు
కంబళ్ళు చాలని చలి రాత్రుళ్ళు

కొత్త  ధాన్యపు పోటు తో పాడేటి రోకళ్ళు
అరిసలు చక్రాలు లొలోన తిరిగేటి మూకుళ్ళు
గాలి పటాల ఆటలో తెలేటి పిల్లగాళ్ళు
కోడి పందేములలో మునిగేటి పోటుగాళ్ళు
పై పందాలు కాచేటి పెద్దోళ్ళు
రాగి  డబ్బు రేగి పండ్లతో పాపాలకు భోగి పళ్ళు
పట్టు పావడాలతో మెరిసేటి పెరంటాళ్ళు
వెచ్చ వెచ్చని క్రొత్త జంటల కౌగిళ్ళు
ఆట పట్టించే ఆకతాయి మరదళ్ళు
ఆర్తి తో ఇల్లాళ్ళు చెల్లించేటి మొక్కుబళ్ళు
సంతుష్టి తో సమ దృష్టి తో దీవించేటి దేవుళ్ళు

రావమ్మ రావమ్మా సంక్రాంతి
మా పల్లె వాసుల సంతోషాల శ్రవంతి సంక్రాంతి
ఆనందముగా తలలూచు వరిమళ్లు
గల గలా పారేటి సెలయేళ్ళు
జోరుగా సాగేటి ఎడ్లబళ్ళు
గణ గణ మొగేటి మువ్వల సవ్వళ్ళు

ఆలా మండలతో నిండారు చావాళ్ళు
నందనదనముగా తోచు మా పల్లెటూళ్ళు
రంగు రంగుల రంగవల్లుల లోగిళ్ళు
గోగు పూలతో అలరారు గొబ్బిళ్ళు

గంగిరేద్దులనాడించు మేళగాళ్ళు
హరికీర్తనలు  ఆలపించు తాళగాళ్ళు
భోగి మంటలు మొదలయేటి పగళ్ళు
కంబళ్ళు చాలని చలి రాత్రుళ్ళు

కొత్త  ధాన్యపు పోటు తో పాడేటి రోకళ్ళు
అరిసలు చక్రాలు లొలోన తిరిగేటి మూకుళ్ళు
గాలి పటాల ఆటలో తెలేటి పిల్లగాళ్ళు
కోడి పందేములలో మునిగేటి పోటుగాళ్ళు
పై పందాలు కాచేటి పెద్దోళ్ళు
రాగి  డబ్బు రేగి పండ్లతో పాపాలకు భోగి పళ్ళు
పట్టు పావడాలతో మెరిసేటి పెరంటాళ్ళు
వెచ్చ వెచ్చని క్రొత్త జంటల కౌగిళ్ళు
ఆట పట్టించే ఆకతాయి మరదళ్ళు
ఆర్తి తో ఇల్లాళ్ళు చెల్లించేటి మొక్కుబళ్ళు
సంతుష్టి తో సమ దృష్టి తో దీవించేటి దేవుళ్ళు

రావమ్మ రావమ్మా సంక్రాంతి
మా పల్లె వాసుల సంతోషాల శ్రవంతి 

Thursday, 3 December 2015

అమ్మ

అమ్మ 


పది మాసాలు మోసి
రక్త మాంసాలు పంచి
పెంచి ఉపిరి నిచ్చింది
అమ్మ

నే నవ్వితే నవరత్నాలు ఏరుకుంటుంది
నే నలత పడితే తానూ నలిగిపోతుంది
నే కలత పడితే తానూ కళోత్తుకుంటుంది
నే కడుపు నిండా తింటే తను త్రేస్తుంది

ముద్ద ముద్దను మురిపాలలో ముంచి తినిపిస్తుంది
గుండె కొండపై ఎక్కించి గుడిగంట కొట్టిస్తుంది
తన గుండె లోతుల్లో దేవుడికి
నా కోసం ముడుపులు కడుతుంది

తన ఎద చనుమాలలో
అమృతపు ఊతలు ఊరిస్తుంది
తన ఒడి తోటలో
ఉయలలూగిస్తుంది
తన అనుభవాల బడిలో
సుద్దు బుద్దులు దిద్దిస్తుంది

ఎతెత్తి  ఆటలు ఆడిస్తుంది
 ఉతుత్తి కోపం నటిస్తుంది
నా రేపటికి
తన రేబవళ్ళను కలిపి కరిగిస్తుంది
నా భావికై తాను బాటలు వేస్తుంది
రాళ్లు ముళ్ళు ఏరి పూలు పరుస్తుంది
నేను కనబడక పోతే కలవరం
నా అభ్యున్నతే తనకు వరం
అమ్మ ప్రేమ తక్కెడ లో
క్రింది పళ్ళెం ఎప్పుడూ నాదే

బంగారు లోకం

బంగారు లోకం

శుభోదయం  అంటూ
లేపి మరీ
చిరు నవ్వుతో పలకరిస్తావు

సుప్రభాత సేవలు
అడిగి అలిగి
మరి మరి
చెయ్యించుకుంటావు
పవళింపు సేవ వరకు
అమ్మ బామ్మ తాత నాన్న
అందరికీ మార్చి  మార్చి
డ్యూటీ వేస్తుంటావు

ఆ , ఊ  ,ఉంగా  అంటూ
మంత్రాలు వల్లిస్తుంటావు
ఇంటిల్లిపాదిని
మంత్రముగ్దుల్ని చేస్తావు

నీ చిన్ని చెయ్యే
మంత్రదండం అన్నట్లు
అందరినీ
ఓ అటాడిస్తావు

పట్టు పిడికిలి తో చీర  చెరగును పట్టి
ఇంకెక్కడికి అంటావు
విడిపించుకొని పోతే
నా కింకేవ్వరన్నట్లు బేర్ మంటావు
ఎత్తుకుంటే ఎద మెట్లెక్కి
కిల కిలా నవ్వుతావు
బుల్లి పిట్టలా నోరు తెరచి
మొదటి  ముద్దకై గొడవ చేస్తావు
మూడో ముద్దకే మూతి బిగించెస్తావు

చీకటి పడగానే ఏమి ఎరగనట్లు
హాయిగా అమాయకం గా బజ్జుంటావు
అలా  నిన్ను  చూస్తుంటే
పని భారం చిరాకు పరాకు మటుమాయం
నీ పక్కన చేరి పొదువుకొని
మెత్తగా ముద్దిస్తే
మత్తులో కూడా
ఓ చిరునవ్వు బహుమతి ఇస్తావు

నా బాల చంద్రుడివి నీవు
నీ బోసి నవ్వుల వెన్నెలలే

నా బంగారు లోకం 


ఎన్నికల సంక్రాంతి

సంక్రాంతి 



నేను మాత్రం అమ్మను కానా

నేను మాత్రం అమ్మను కానా 


చిన్ని కృష్ణా 

ఆ ఇంట పంటవైతేనేం
నా ఇంట నందనందనుడివై నడయాడినావు

కన్న తల్లిని కాకున్నా
కనుపాపవన్నట్లు కాచినాను
(గారముగా ) గోరుముద్దలు గరిపినాను
పట్టు పీతంబరములు చుట్టి  మురిసినాను
పాపడి వై పారాడుతుంటే
పావన   యమునా ప్రవాహమని
పరవశ్య నైనాను
కాళింది పై నాట్యమాడిన పాదాలకు
పారణి అద్దినాను
గోవర్ధనమేట్టిన గోటికీ
గోరింతలలద్దినాను
సిరి మువ్వ గజ్జలతో
ఘల్లు ఘల్లంచు
నట్టింట నీవు నడయాడ
సిరుల పైరు పండించుకున్నాను
రోటికి కట్టితిని అని రొషమా ఏమి
మట్టినోతిని చూసి మందలించితినని
కినుకా స్వామి
మాయ మాటలు చెప్పి
మరలి వత్తునని వత్తిపలికి
మరలినావు
గురుతు రాలేదా
ఈ రేపల్లీ తల్లి యశోదమ్మ
వాకిట నీ పడగురుతులు వేసి
రంగవల్లులు తీర్చి
వత్సల్యపు పూలు పరచి
వేచి యుంటి రా రా
కన్నా నా చిన్ని కృష్ణా !